![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ తెలుగులో ప్రతీ సీజన్ లో కొన్ని బాండింగ్స్ ఎప్పటికి గుర్తుండిపోతుంటాయి. అయితే సీజన్-9 లో కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి. హౌస్ లో ఎవరో ఒకరు ఏ రిలేషన్ లో అయినా ఉంటు వస్తున్నారు. ఇలా ప్రతీ సీజన్ లో ఏదో ఒక రిలేషన్ తో కనెక్ట్ అవుతున్నారు. అలా కనెక్ట్ అయిన రిలేషన్ హౌస్ లో నుండి బయటకు వచ్చాక కూడా కంటిన్యూ అవుతున్నాయి. గత సీజన్ లో శివాజీని నయని పావని డాడీ అంటూ పిలిచేది. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా శివాజీని అలాగే పిలుస్తుంది నయని పావని.
ప్రస్తుతం హౌస్ లో రెండు రకాల రిలేషన్ షిప్ లు ఉన్నాయి. ఒకటి రీతూ, డిమాన్ పవన్ వాళ్ళది.. ఫ్రెండ్ కంటే ఎక్కువ రిలేషన్ షిప్ అంట వారిద్దరిది.. ఆ విషయం వాళ్లే చెప్పుకున్నారు. ఇంకొకరు భరణిని తనూజ నాన్న అని పిలుస్తుంది. అలా వీళ్ళిద్దరి బాండింగ్.. నెవెర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ ఎక్కువగా మెయిన్ ఎపిసోడ్ లో ఇవ్వకపోవచ్చు కానీ లైవ్ లో మాత్రం చాలా క్యూట్ గా ఉంది.
తనూజని ఇమ్మాన్యుయల్ ఆటపట్టిస్తుంటే.... తనూజ చిన్నపిల్లలాగా భరణి దగ్గరికి వచ్చి నాన్న చూడు వాడు.. ఎలా అంటే అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నాడు అని కంప్లైంట్ ఇస్తుంటే.. వాడి సంగతి చెప్తాను పదా.. ఈ రోజు అయిపోయాడు వాడు అని భరణి అంటాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ పైకి భరణి గొడవకి వెళ్తాడు. వీకెండ్ లో భరణి సేవ్ కాగానే తనూజ ఎమోషనల్ అవుతుంది. వీళ్ళ ఇద్దరి బాండింగ్ కి సోషల్ మీడియా లో పాజిటివ్ గా రీల్స్ అండ్ మీమ్స్ వస్తున్నాయి. భరణి నాన్నగా.. తనూజ కూతురిగా.. ముఖ్యంగా తనూజని డాడ్ లిటిల్ ప్రిన్స్ అంటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇమ్మాన్యుయల్, తనూజ, భరణి కాంబో హౌస్ లో పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది.
![]() |
![]() |